'సైరా'లో మేజర్ హైలైట్ సీన్ ఇదేనట
- చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా'
- దర్శకుడిగా సురేందర్ రెడ్డి
- ఒకే రోజున 5 భాషల్లో విడుదల
ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు. నోస్సం ఫోర్ట్ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. దేశ విదేశాలకి చెందిన ఆర్టిస్టులు .. ఫైటర్స్ కలుపుకుని 2000 మందితో, 35 రాత్రుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా చిత్రీకరించినట్టుగా చెప్పారు. రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సన్నివేశంలో మెగాస్టార్ ఏ స్థాయిలో విజృంభించారో చూడాలి మరి.