రానా సినిమాకి నో చెప్పేసిన కీర్తి సురేశ్
- కీర్తి సురేశ్ కి మంచి ఫాలోయింగ్
- కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ
- రానాతో కొరియన్ మూవీ రీమేక్
ఈ నేపథ్యంలోనే రానా సినిమాలోనూ చేయడానికి 'నో' చెప్పేసిందట. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్ ను తీసుకున్నది రానానే. ఆయన జోడీగా కీర్తి సురేశ్ ను సంప్రదించగా ఆమె 'నో' చెప్పేసిందట. దీనికి కారణం, ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట.