తెలుగు రాష్ట్రాల్లో 'సైరా'కి లాభాలు రావాలంటే ఈ మార్కును దాటవలసిందేనట
- భారీస్థాయిలో 'సైరా' బిజినెస్
- దిల్ రాజు చేతికి నైజామ్ ఏరియా హక్కులు
- అమెజాన్ చేతికి డిజిటల్ రైట్స్
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీస్థాయిలో బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా నైజామ్ ఏరియా హక్కులను 30 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నారు. సీడెడ్ ఏరియా హక్కులను ఎన్వీ ప్రసాద్ 22 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112.30 కోట్లకు అమ్ముడైంది. అందువలన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 120 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తే లాభాల బాట పట్టినట్టు అవుతుందని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 40 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.