కొత్త ప్రాజెక్టుతో రంగంలోకి దిగిన కార్తికేయ
- కార్తికేయ హీరోగా కొత్త చిత్రం
- దర్శకుడిగా శేఖర్ రెడ్డి పరిచయం
- ఈ నెల 9వ తేదీన ఫస్టులుక్
'ఆర్ ఎక్స్100' సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఒక రకంగా ఇది కార్తికేయ సొంత బ్యానర్ అనుకోవాలి. ఈ సినిమాతో శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.