'పేటా' దర్శకుడితో ధనుశ్
- ధనుశ్ తాజా చిత్రంగా 'అసురన్'
- లైన్లో దురై సెంథిల్ కుమార్
- ధనుశ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించనున్న కార్తీక్ సుబ్బరాజ్
తమిళనాట విపరీతమైన క్రేజ్ ను కలిగిన దర్శకులలో ఒకరుగా కార్తీక్ సుబ్బరాజ్ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 'పేటా'తో రజనీకి హిట్ ఇచ్చిన ఆయన, ధనుశ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ ను ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో చూపిస్తాడట. తొలిసారిగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుండటంతో అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.