'ఇస్మార్ట్ శంకర్' నుంచి మనసుకు పట్టేసే పాట
- పూరి నుంచి రానున్న 'ఇస్మార్ట్ శంకర్'
- రామ్ సరసన ఇద్దరు నాయికలు
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
మణిశర్మ కట్టిన బాణీ చాలా బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఆయన ఈ పాటను స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం బాగుంది. ప్రేమికుల భావజాలాన్ని ఆవిష్కరించడానికి ఆయన అందమైన పదజాలాన్ని అర్థవంతంగా ఉపయోగించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహరా ఈ పాటకి ప్రాణం పోశారు. మొత్తంగా చెప్పాలంటే ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిలా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.