సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సూర్యతో జతకట్టనున్న నయనతార
- సంపత్ నంది దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- వచ్చే వారం 'వాల్మీకి' టీజర్
* సంపత్ నంది దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రం చేయనున్నాడు. సంపత్ చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పాడట. ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక ఇది మొదలవుతుంది.
* హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కాగా, వచ్చే వారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తారు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.