సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా చేయాలనుకుంటున్న సినిమా
- పాండిచ్చేరిలో 'సైరా' షూటింగ్
- పొలిటికల్ థ్రిల్లర్ తో వస్తున్న విష్ణు
* చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'సైరా' షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నాడు. ఇందులో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* మంచు విష్ణు నటించిన 'ఓటర్' చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురభి నాయికగా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు.