నాపై విమర్శలకు నటనతోనే చెక్ పెడతా: హీరో కార్తికేయ
- చేసింది ఒక సినిమాయేగా అనుకుంటున్నారు
- చాలామందిని చూశాములే అని చెప్పుకుంటున్నారు
- సవాళ్లు విసిరే పనిపెట్టుకోలేదు
ఓ.. ఇంతకు ముందు చాలామందే ఇండస్ట్రీకి వెళ్లారు .. ఇలాగే ఎగిరారు .. చూద్దాంలే అని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు నాకు వినిపిస్తూనే వున్నాయి. నేనేంటో నిరూపిస్తాను .. నా సత్తా చూపిస్తాను అంటూ నేను సవాళ్లు విసరను. నా నటనతోనే వాళ్లకి సమాధానం చెప్పాలనే పట్టుదలతో నవ్వేసి ఊరుకుంటున్నాను. అనుకున్నది సాధించిన తరువాత కూడా అలాంటివాళ్లను నవ్వుతూనే పలకరిస్తాను" అని చెప్పుకొచ్చాడు.