'హిప్పీ' చేయడానికి కారణమదే: హీరో కార్తికేయ
- ఏడాదిగా చాలా కథలు విన్నాను
- కొన్ని కథలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను
- ఈ నెల 6వ తేదీన విడుదల
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ఆర్ ఎక్స్ 100' సినిమా తరువాత నేను చాలా కథలు విన్నాను. వాటిలో కొన్ని కథలను ఎంచుకుని వాటిని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎంచుకున్న ఈ కథల్లో 'ఆర్ ఎక్స్ 100' కి పూర్తి భిన్నంగా ఏది వుందో చూసుకున్నాను. ఎందుకంటే 'ఆర్ ఎక్స్ 100'తో పోలిక రాకూడదని అలా చేశాను. అలాంటప్పుడు కథాకథనాల పరంగా .. లుక్ పరంగా పూర్తి భిన్నంగా నాకు 'హిప్పీ' కనిపించింది. అందువల్లనే ఈ సినిమా చేశాను" అని చెప్పుకొచ్చారు.