ఏపీ కొత్త అడ్వకేట్ జనరల్‌గా శ్రీరాం.. ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి!
- దమ్మాలపాటి స్థానంలో శ్రీరాం
- శ్రీరాం.. పొన్నవోలు పేర్లను ఓకే చేసిన జగన్
- ప్రమాణ స్వీకారం అనంతరం ఉత్తర్వులు
అలాగే, అదనపు అడ్వకేట్ జనరల్‌గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం. జగన్ రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీరి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏజీ, ఏఏజీ నియామకాల తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు(ఎస్‌జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ), కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లను నియమించనున్నారు.