నా కెరియర్లో నేను ఆ పాత్రను ఒప్పుకోకుండా వుండాల్సింది: హీరోయిన్ నయనతార
- తెలుగు .. తమిళ భాషల్లో నయన్ కి క్రేజ్
- 'గజిని'లో నా పాత్ర ముందుగా నాకు చెప్పినట్టు లేదు
- ఆ పాఠం తరువాత జాగ్రత్త పడ్డాను
తాజా ఇంటర్వ్యూలో నయనతార ఈ సినిమాను గురించే ప్రస్తావిస్తూ .. "నా కెరియర్లో నేను తీసుకున్న చెత్త నిర్ణయం ఏదైనా వుందీ అంటే అది 'గజిని' సినిమాలో నేను చేసిన పాత్రను ఒప్పుకోవడమే. ఈ సినిమాకి ముందు నా పాత్రను గురించి నాకు చెప్పింది వేరు .. తెరపై చూపించింది వేరు. దాంతో నా పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండాపోయింది. ఆ పాఠం నేర్చుకున్న దగ్గర నుంచి పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను" అని చెప్పుకొచ్చింది.