'దర్బార్' షూటింగులో జాయినైన నయనతార
- సెట్స్ పై రజనీ 167వ సినిమా
- మురుగదాస్ దర్శకత్వంలో తొలిసారి
- చాలా కాలం తరువాత రజనీ జోడీగా నయన్
అభిమానులు రజనీ సరసన నయనతారను చూసి చాలాకాలమే అయింది. అందువలన ఈ కాంబినేషన్ పై వాళ్లంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ సినిమాలో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. సామాజిక సేవకుడిగా ఆయన మరో పాత్రలోను కనిపించనున్నాడనే టాక్ వుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావలసి వుంది. రజనీ .. మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారిగా రూపొందుతోన్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.