కేరళలోని దట్టమైన అడవుల్లో 'సైరా' షూటింగు
- షూటింగు దశలో 'సైరా'
- కేరళ అడవుల్లో పోరాట సన్నివేశాలు
- హైదరాబాద్ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తి
ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 10 రోజుల పాటు అక్కడ పోరాట సన్నివేశాలనే చిత్రీకరిస్తారు. హైదరాబాద్ వచ్చిన తరువాత, ఇక్కడ ఒక షెడ్యూల్ షూటింగు జరగనుంది. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఆ తరువాత వీఎఫెక్స్ పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అమితాబ్ .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.