'జబర్దస్త్' కామెడీ షోకి న్యాయనిర్ణేతగా వుండేందుకు నిరాకరించిన జయసుధ
- పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
- రోజా స్థానంలో మీనా
- నాగబాబు ప్లేస్ లో శేఖర్ మాస్టర్
ఆ క్రమంలోనే జయసుధను కూడా సంప్రదించారనీ, అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కుటుంబ కథా చిత్రాల నాయికగా .. సహజనటిగా జయసుధకు మంచి పేరు వుంది. రీ ఎంట్రీలో ఆమె తన వయసుకి తగిన హుందాతనంతో కూడిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఈ కారణంగానే తనకి, ఈ కామెడీ షోకి సెట్ కాదని ఆమె సున్నితంగా తిరస్కరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. జయసుధ తిరస్కరించిన తరువాతనే మీనాని ఎంపిక చేసుకున్నారన్న మాట. ఇక నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్ చేస్తోన్న సంగతి తెలిసిందే.