విజయ్ మూవీలో జాకీ ష్రాఫ్ పవర్ఫుల్ రోల్
- అట్లీకుమార్ తో విజయ్ మూడో మూవీ
- కథానాయికగా నయనతార
- దీపావళికి భారీస్థాయి విడుదల
ఆయన తాజా చిత్రం విజయ్ హీరోగా రూపొందుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. గతంలో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' భారీ విజయాలను అందుకున్నాయి. తాజా చిత్రంలో విజయ్ సరసన నాయికగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో కీలకంగా నిలిచే పవర్ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అయ్యారు. 'మాయావనం' తరువాత జాకీ ష్రాఫ్ తమిళంలో చేస్తోన్న సినిమా ఇది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.