తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న నాటకమే ‘డేటా చోరీ’: నటుడు శివాజీ
- డేటా చౌర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వం
- కేసీఆర్ ని చూస్తే ఎందుకు భయపడాలి?
- హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను కేసీఆర్ చంపేశారు
ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించిన ‘నమో యాప్’ గురించి ఆయన ప్రస్తావించారు. అందులో, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల డేటా ఉందని అన్నారు. 2018 ఆగస్టు 28న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీటింగ్ నిర్వహించారని, ఆ మీటింగ్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని, కేంద్ర ప్రభుత్వ లబ్ధి దారుల వివరాలను పెన్ డ్రైవ్ లో తీసుకురావాలని ఆ సీఎంలను అమిత్ షా ఆదేశించారని శివాజీ ఆరోపించారు.