గోవాకు బయలుదేరుతున్న 'ఇస్మార్ట్ శంకర్'
- రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'
- హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
- గోవాలో హీరో హీరోయిన్లపై సీన్స్
తదుపరి షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేశారు. నాయకా నాయికల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. రామ్ మాస్ లుక్ కి మంచి మార్కులు పడిపోవడంతో, ఆయనకి ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.