రామ్ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్
- మాస్ లుక్ తో రామ్
- యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- 'నోరాఫతేహి'తో ఐటమ్ సాంగ్
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పూరి - మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. 'అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో సందడి చేస్తూనే వుంది. ఆ ఐటమ్ సాంగ్ కి మించిన ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని పూర్తిచేశాడని అంటున్నారు. త్వరలోనే 'నోరా ఫతేహి'పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.