ఇది 'మందు'బాబులను దోపిడీ చేయడమే!: ఉండవల్లి
- భారీ ధరకు అమ్మడంపై మండిపాటు
- స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం అల్లాడిపోతుందని హెచ్చరిక
- 1.30 లక్షల కోట్ల అప్పును ఏం చేశారని ప్రశ్న
మందు బాబులు ఓ వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల మందు బాటిళ్లను ఉండవల్లి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల అప్పు తీసుకుందనీ, ఈ నిధులను ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై పలువురు తనను సంప్రదిస్తున్నారనీ, ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తామని చాలామంది అంటున్నారని వెల్లడించారు.