'సాగర సంగమం' నేను చేయవలసిన సినిమా.. అలా జారిపోయింది!: జయసుధ
- 'సాగర సంగమం' మూవీకి సైన్ చేశాను
- డేట్స్ సర్దుబాటు చేయడం కుదరలేదు
- సినిమా వదులుకోవద్దని కమల్ గట్టిగా చెప్పారు
దాంతో మళ్లీ వాళ్లు నా డేట్స్ అడిగారు. అప్పుడు నేను ఏఎన్నార్ గారి సినిమా ఏదో చేస్తున్నాను. అందువలన డేట్స్ సర్దుబాటు చేయడం కుదరలేదు .. దాంతో జయప్రదను తీసుకున్నారు. ఈ సినిమాను వదులుకోవద్దని కమల్ నన్ను తిట్టారు కూడా .. అయినా తప్పలేదు. ఈ సినిమా చూసిన తరువాత నా కంటే జయప్రదనే ఆ పాత్రకి సరిగ్గా సరిపోయిందని అనిపించింది" అని చెప్పుకొచ్చారు .