రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభుదేవా మూవీ
- డాన్స్ ప్రధానంగా సాగే కథ
- ముఖ్య పాత్రల్లో ప్రభుదేవా .. ఐశ్వర్య రాజేశ్
- ఈ నెల 24వ తేదీన విడుదల
ప్రధానమైన 'లక్ష్మి' పాత్రలో దిత్యా భాన్డే కనిపించనుంది. ప్రభుదేవా .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ లో స్ఫూర్తిని పెంపొందింపజేసే కంటెంట్ తో వస్తోన్న ఈ సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.