10 కోట్లు రాబట్టేసిన 'ఆర్ ఎక్స్ 100'
- ప్రేమను కొత్తకోణంలో చూపిన 'ఆర్ ఎక్స్ 100'
- కార్తికేయ సరసన పాయల్ రాజ్ పుత్
- యూత్ నుంచి విశేషమైన స్పందన
ఈ సందర్భంగా ఈ సినిమా కథానాయకుడు కార్తికేయ మాట్లాడుతూ .. " ప్రేమను కొత్త కోణంలో చూపించిన సినిమా ఇది. ప్రేమలో పడిన ప్రతి కుర్రాడు ఈ సినిమాలోని హీరో పాత్రలో తనని చూసుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ప్రేమకథా చిత్రం రాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత్రలను మలచిన తీరు వాస్తవానికి దగ్గరగా ఉందని చెబుతున్నారు. ఈ కొత్తదనం కారణంగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం మా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.