'ఆర్ ఎక్స్ 100' కథ ముందుగా సుధీర్ బాబు దగ్గరికి వచ్చిందట!
- 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడిగా భూపతి రాజా
- కథ అలా కార్తికేయ దగ్గరకొచ్చింది
- భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది
ఈ కథను పట్టుకుని దర్శకుడు అజయ్ భూపతి ముందుగా సుధీర్ బాబు దగ్గరికే వచ్చాడట. మూడు నాలుగు నెలలు గడిచినా సుధీర్ బాబు పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, కథ కార్తికేయ దగ్గరికి వచ్చిందని సమాచారం. సుధీర్ బాబు ఈ సినిమాను చేసి వుంటే 'సమ్మోహనం' వెంటనే మరో హిట్ పడి ఉండేది. ఇక తన బ్యానర్లో చేసి వుంటే నిర్మాతగాను ఆయనకి హిట్ పడేదని చెప్పుకుంటున్నారు. నిజంగానే ఈ కథ సుధీర్ బాబుకి సెట్ అయ్యేదిగా అనిపిస్తోంది కదూ.