'ఆర్ ఎక్స్ 100' .. రెండో రోజు అదే జోరు
- యూత్ మెచ్చిన చిత్రంగా 'ఆర్ ఎక్స్ 100'
- కొత్తవాళ్లే అయినా భారీ ఓపెనింగ్స్
- చిన్న సినిమా .. పెద్ద విజయం
రొమాంటిక్ లవ్ స్టోరీకి యాక్షన్ ను కలిపి దర్శకుడు అజయ్ భూపతి అందించిన తీరు కుర్రకారుకు బాగా నచ్చేసింది. దాంతో థియేటర్ల దగ్గర జనం పెరిగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను ఈ సినిమా 2.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన వాటి జాబితాలో ఈ సినిమా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.