రానా హీరోగా తరుణ్ భాస్కర్ మూవీ!
- 'హాథీ మేరే సాథీ'తో రానా నెక్ట్స్ మూవీ
- నెక్స్ట్ మూవీ 'కోడి రామ్మూర్తి' బయోపిక్
- తరువాత చిత్రం సొంత బ్యానర్లో
ఈ సినిమా తరువాత సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ మరో సినిమాను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ బ్యానర్లో మూడవ సినిమాను రానాతో చేయనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రానా 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన 'కోడి రామ్మూర్తి' బయోపిక్ ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన తరువాత తరుణ్ భాస్కర్ తో కలిసి రానా సెట్స్ పైకి వెళతాడన్నమాట.