సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మూడు సినిమాలతో బిజీ బిజీగా సమంత
- మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
- తెలుగులో నివేదా థామస్ మరో చిత్రం
* ప్రస్తుతం వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు, దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేసి, మహేశ్ కి వినిపించాడని, మహేష్ సంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది.
* అందాలబొమ్మ నివేదా థామస్ త్వరలో శ్రీవిష్ణుతో జతకట్టనుంది. 'మెంటల్ మదిలో' ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రీవిష్ణు, నివేద జంటగా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.