మాస్ ఆడియన్స్ కోసం ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి
- 'మారి' సినిమాకి సీక్వెల్
- దర్శకుడిగా బాలాజీ మోహన్
- కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి .. ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె పర్ఫెక్ట్ గా ఆటో నడపడం నేర్చుకుందట. ఈ పాత్రతో ఆమె మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు గనుక, ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి ఏ స్థాయిలో అదరగొట్టిందో ఇక్కడివాళ్లు కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం.