నా పిల్లలు నాలా కష్టపడకూడదు: సన్నీ లియోన్
- 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ద్వేషపూరిత మెసేజ్ లు వచ్చేవి
- వాటిని చూసి చాలా కుంగిపోయాను
- నా తల్లిదండ్రులే నాకు అండగా నిలిచారు.
ఆ సమయంలో తనకు తన తల్లిదండ్రులే అండగా నిలిచారని చెప్పింది. వాస్తవానికి వారికి ఇష్టం లేని రంగం ఎంచుకున్నప్పటికీ వారు తనకు అండగా నిలిచారని తెలిపింది. అందుకే తన జీవితం ఎలా ఉన్నా ప్రేమిస్తానని, అసలు మన జీవితంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పిల్లలు ఎదుర్కోకూడదని చెప్పింది. వారు ఎంచుకున్న రంగాలను తాను ఇష్టపడినా, పడకున్నా... వారు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంది. కాగా, సన్నీలియోన్ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.