నెక్స్ట్ మూవీ కోసం థాయ్ లాండ్ కి అఖిల్
- వెంకీ అట్లూరితో అఖిల్ మూవీ
- థాయ్ లాండ్ నేపథ్యంలో కథ
- దర్శకుడితో కలిసి అక్కడికి వెళ్లిన అఖిల్
వెంకీ అట్లూరి వినిపించిన లైన్ అఖిల్ తో పాటు నాగార్జునకి కూడా నచ్చేసింది. థాయ్ లాండ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. అందువలన 60 శాతం షూటింగును అక్కడే జరపనున్నారు. కథకి పూర్తి రూపాన్ని కూడా అక్కడే తీసుకువద్దామనే ఉద్దేశంతో వెంకీ అట్లూరి .. అఖిల్ కలిసి థాయ్ లాండ్ వెళ్లినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.