'రాజుగాడు' టీజర్ కి ముహూర్తం కుదిరింది
- 'రాజుగాడు'గా రాజ్ తరుణ్
- కథానాయికగా అమైరా దస్తూర్
- త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ నటించింది. యూత్ కి నచ్చే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా నుంచి, 'ఉగాది' రోజైన మార్చి 18న టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.