అప్పులు తీర్చడం కోసమే హైదరాబాద్ వచ్చాను: 'జబర్దస్త్' గెటప్ శీను
- అమ్మానాన్నలకు ఏమీ తెలియదు
- నా చదువు మధ్యలో ఆగిపోయింది
- ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను
"ఇక సినిమాల గురించి మా అన్నయ్యకి బాగానే తెలుసు. అందువల్లనే ఆయన నన్ను బాగా ప్రోత్సహించాడు .. వెనకే ఉంటూ నడిపించాడు. అప్పట్లో అప్పులపాలైపోయి .. మధ్యలోనే చదువు ఆపేసిన పరిస్థితి. అప్పులు తీర్చాలంటే .. సంపాదించాలి .. అందుకోసమే హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వెళితే ఏదో ఒక ఉపాధి చూసుకోవచ్చు .. అలాగే అవకాశాల కోసం తిరగొచ్చు అనే ఆలోచనతోనే వచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు.