'పెళ్లి చూపులు' దర్శకుడికి ఓకే చెప్పేసిన నిఖిల్
- నిఖిల్ కోసం కథ రెడీ చేసిన తరుణ్ భాస్కర్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నిఖిల్
- త్వరలోనే సెట్స్ పైకి
రీసెంట్ గా ఆయన ఒక కథను సిద్ధం చేసుకుని వెళ్లి .. నిఖిల్ కి వినిపించాడట. నిఖిల్ కి ఈ కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. త్వరలో 'కిరాక్ పార్టీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్న నిఖిల్, ప్రస్తుతం 'కణితన్' రీమేక్ పై దృష్టి పెట్టాడు. ఈ ప్రాజక్టును కూడా పూర్తి చేసిన తరువాత ఆయన తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.