తరుణ్ భాస్కర్ న్యూ మూవీ కథా నేపథ్యం అదేనట!
- కొత్త నటీనటులతో తరుణ్ భాస్కర్
- లాంగ్ జర్నీ నేపథ్యంలో సాగే కథ
- సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మాణం
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆయన తెరకెక్కించనున్నాడు. లాంగ్ జర్నీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ మూవీ ఇది అని అంటున్నారు. స్నేహితులైన కొంతమంది అబ్బాయిలు .. అమ్మాయిలు దూర ప్రాంతానికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆ జర్నీలో తమని గురించి తాము తెలుసుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందట. దాదాపు పది నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.