మొత్తానికి సిద్ధార్థ్ కి హిట్ దక్కేసింది!
- తమిళ .. హిందీ భాషల్లో సిద్ధార్థ్ హారర్ థ్రిల్లర్
- నిన్ననే భారీస్థాయిలో విడుదల
- రెండు భాషల్లోను హిట్ టాక్
- వచ్చేవారం తెలుగులోకి
ఈ రెండు భాషల్లోను ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాలో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమాను గురించి చెప్పుకోవడం .. రివ్యూస్ లోను మంచి రేటింగ్ రావడం విశేషం. ఈ సినిమాతో .. చాలాకాలంగా సిద్ధార్థ్ వెయిట్ చేస్తోన్న హిట్ లభించినట్టేనని చెప్పుకుంటున్నారు. వచ్చేవారం తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా 'గృహం' పేరుతో పలకరించనుంది.