పవన్ తో 'మెర్సెల్' రీమేక్ .. అదేం లేదంటున్న నిర్మాత!
- తమిళంలో 'మెర్సెల్' భారీ వసూళ్లు
- విజయ్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్
- కథలో భాగంగా రాజకీయ పరమైన అంశాలు
- ఈ మూవీ తెలుగు రీమేక్ పవన్ చేయనున్నాడంటూ ప్రచారం
ఈ సినిమా తెలుగు వెర్షన్ 'అదిరింది'ని ఇక్కడ శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. శరత్ మరార్ తో పవన్ కి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ రీమేక్ లో చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్, ఆయనకి ఫోన్ చేసి తెలుగు వెర్షన్ ను హోల్డ్ లో పెట్టమన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయం గురించి తనతో పవన్ మాట్లాడలేదని శరత్ మరార్ సన్నిహితులతో చెప్పడం .. తమని రీమేక్ రైట్స్ గురించి ఎవరూ సంప్రదించలేదని 'మెర్సెల్' నిర్మాతలు స్పష్టం చేయడంతో, ఇదంతా పుకారేనని తేలిపోయింది.