నేను చనిపోతే నీకు పెళ్లెవరు చేస్తారే?: ఏడుస్తున్న కూతురిని ఓదార్చిన రేణూ దేశాయ్
- ఆర్తో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడిన రేణు
- నిద్రపోతుంటే వచ్చి ఏడుస్తూ కూర్చున్న ఆద్య
- 'చనిపోవద్దమ్మా' అంటూ ఏడుపు
- ఓదార్చిన రేణూ దేశాయ్
తనకు మెలకువ వచ్చేసరికి '‘ప్లీజ్ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్' అని ఒకటే ఏడుపట. దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను మనసులోనే దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చిందట. మమ్మీని త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడికి దణ్ణం పెట్టుకోమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ వెల్లడించింది.