మంచు విష్ణు చిత్రంలో ఆసక్తికరమైన కంటెంట్!
- ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు
- ముందుగా తమిళ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
- త్వరలో తెలుగు టైటిల్ ఖరారు
- కథానాయికగా సురభి
జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి ఆయన 'కుర్జల్ 388' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. తాజాగా తమిళ టైటిల్ తో కూడిన ప్రీ లుక్ ను కూడా వదిలాడు. పోస్టర్లో ఓ పాత బంగ్లా .. తాళపత్ర గ్రంధాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాచీన కాలంతో ముడిపడిన కథా వస్తువును ఆయన ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. విష్ణు జోడీగా సురభి అలరించనుంది. కామెడీకి అధిక ప్రాధాన్యతనిచ్చే విష్ణు, ఈ సారి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నే ఎంచుకున్నాడనుకోవచ్చు.