విజయ్ సరసన ఛాన్స్... హెబ్బా పటేల్ దశ తిరిగినట్టే!
ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ 'మెర్సల్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారట. వారిలో ఒక కథానాయికగా హెబ్బా పటేల్ ను తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది.