42 ఏళ్ల పండగ చేసుకుంటున్న రజనీ ఫ్యాన్స్!
అలాంటి రజనీకాంత్ నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఈ రోజుతో 42 వసంతాలు పూర్తి చేసుకున్నారు.1975 ఆగస్టు 18న 'అపూర్వ రాగంగళ్' విడుదలతో ఆయన నట ప్రయాణం మొదలైంది. ఎన్నో విభిన్నమైన పాత్రలు ఆయనకి విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ రోజున అభిమానుల గుండెల్లో ఆయనను సూపర్ స్టార్ గా నిలబెట్టాయి. నటుడిగా ఆయన 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అభిమానులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వివిధ సినిమాల్లోని ఆయన గెటప్స్ కి సంబంధించిన ఫోటోలను .. డైలాగ్స్ ను షేర్ చేసుకుంటున్నారు.