ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే
- ఏ పార్టీల మద్దతు తీసుకోవాలో నిర్ణయాన్ని విజయ్‌కి అప్పగించామన్న ఎమ్మెల్యే
- రిసార్టు రాజకీయాలు చేయవద్దని విజయ్ ఆదేశించారన్న ఎమ్మెల్యే
- గవర్నర్ రాగానే శాసనసభా పక్ష నేత వెళ్లి గవర్నర్‌ను కలుస్తారన్న ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లలో గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో రిసార్టు రాజకీయాలు వద్దని విజయ్ పార్టీ కేడర్‌కు సూచనలు చేయడం గమనార్హం.
మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీవీకే శాసనసభాపక్షం ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పది సీట్లు తక్కువగా ఉన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే పార్టీ కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీని నిరూపించుకోవడానికి టీవీకే నేతలు గవర్నర్‌ను కలిసి పదిహేను రోజుల సమయం కోరనున్నారని తెలుస్తోంది.