బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్.. స్పందించిన మమతా బెనర్జీ
- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ
- తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ధీమా
- టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపణ
ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, 2021, 2024లోనూ అలాగే చేశాయని అన్నారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికే ఎగ్జిట్ పోల్స్ తప్పుడు ప్రచారాలని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.