రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా
- ముంబైలో ఆక్షన్ నిర్వహించగా కొనుగోలు చేసిన సీరమ్ వ్యవస్థాపకులు
- 1890లలో రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ పెయింటింగ్
- అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా రికార్డు
రాజా రవివర్మ ఈ ఆయిల్ పెయింటింగ్‌ను 1890లలో గీశారు. వేలంలో రూ.167 కోట్లు పలకడంతో అత్యంత ఖరీదైన ఆధునిక భారతీయ కళాఖండంగా యశోద, కృష్ణ చిత్రం నిలిచింది. గత సంవత్సరం ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీనిని ఢిల్లీకి చెందిన కిరణ్ నాదర్ దక్కించుకున్నారు.
పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని, ఇది తన బాధ్యత అని సైరస్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇది జాతీయ సంపద అని, దీనిని క్రమంగా ప్రజల వీక్షణ కోసం అందుబాటులో ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.