తెలంగాణలో ఈగల్, హైడ్రా తరహాలో మరో సరికొత్త వ్యవస్థ... రేవంత్ రెడ్డి ప్రకటన
- ఆహార కల్తీ నియంత్రణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి
- దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి
- రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామన్న సీఎం
సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, హైడ్రా, ఈగల్ తరహాలో సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని అన్నారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు.
రైతుల హక్కులను కాపాడేందుకు తాము కనీస మద్దతు ధర చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని వాపోయారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.