ఓటీటీకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ .. 'ఈషా'
- డిసెంబర్ 12న విడుదలైన 'ఈషా'
- నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ
- థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్
- రీసెంటుగా ఓటీటీకి వచ్చిన సినిమా
డిసెంబర్ 12వ తేదీన విడుదలైన ఈ సినిమాలో త్రిగుణ్ .. హెబ్బా పటేల్ .. అఖిల్ రాజ్ .. సిరి హనుమంతు ప్రధానమైన పాత్రలను పోషించారు. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టిన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఓ మాదిరి కంటెంట్ తో ఈ సినిమాను రూపొంది ఉండొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా భయపెట్టగలిగింది.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నలుగురు స్నేహితులు, దెయ్యాలు - ప్రేతాత్మలు లేవని బలంగా నమ్ముతూ ఉంటారు. దెయ్యాల పేరుతో భయపెడుతున్న దొంగ స్వామీజీలను పట్టుకుని, తమ నమ్మకాన్ని వెలుగులోకి తెస్తూ ఉంటారు. అలా ఆదిదేవ్ అనే ఒక స్వామీజీని కూడా పట్టించాలనే ఉద్దేశంతో, ఆంధ్ర - ఒడిశా బోర్డర్ కి ఈ నలువురు ఫ్రెండ్స్ బయల్దేరతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగిలిన కథ.