ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే!
- 'పూవన్' సినిమాతో ఎంట్రీ
- 'సిరై'తో దక్కిన భారీ హిట్
- అందరి దృష్టిని ఆకర్షించిన అనిష్మా
- ఆమె నటనకు దక్కుతున్న ప్రశంసలు
అనిష్మా తమిళంలో చేసిన 'సిరై' సినిమా రీసెంటుగా ఓటీటీలోకి వచ్చింది. తమిళంలో థియేటర్లవైపు నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది గానీ, తెలుగు ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఓటీటీలో తెలుగులోను వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా ఒక రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఒక విలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ, ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా చూసిన వాళ్లలో చాలామంది అనిష్మా నటనకు ఎక్కువ మార్కులు ఇస్తారు. తాను ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను .. మతాన్ని .. ఊరును .. చివరికి విధిని ఎదురించి నిలిచిన పాత్రలో అనిష్మా నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి నటనతో మెప్పించినది ఈ అమ్మాయి మాత్రమేనేమో అనిపిస్తుంది. 2023లో 'పూవన్' అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిష్మాకి, 'సిరై'తో గట్టి హిట్ పడిందనే చెప్పాలి. తెలుగు నుంచి ఈ అమ్మాయికి మంచి పాత్రలు వెళతాయోమో చూడాలి.