బండి సంజయ్, గంగుల తీరుతో కరీంనగర్ అవినీతిమయమైంది: పొన్నం ప్రభాకర్
- కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం కుదర్చుకున్నాయన్న పొన్నం
- రెండు పార్టీల అవగాహనతో అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆరోపణ
- పదేళ్లలో కరీంనగర్ నిర్లక్ష్యానికి గురయిందని విమర్శ
కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం మండిపడ్డారు. ఈ పార్టీల పరస్పర అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆరోపించారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ తీరుతో జిల్లా అవినీతిమయంగా మారిందని అన్నారు. పదేళ్లలో కరీంనగర్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని చెప్పారు. జిల్లా పరిధిలోని కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.