అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి: పార్థసారథి, వర్ల రామయ్య
- చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలు చేశారన్న టీడీపీ నేతలు
- అంబటి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్య
- అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్ చెప్పాలని డిమాండ్
అంబటి రాంబాబు చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇలాంటి వ్యక్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చంద్రబాబు ఔన్నత్యాన్ని తాకలేవని చెప్పారు. అంబటి వాడిన పదజాలాన్ని ఆయన భార్యాబిడ్డలు కూడా ఛీకొడతారని అన్నారు. జగన్ భార్య భారతి గురించి మాట్లాడిన టీడీపీ నేతను అరెస్ట్ చేయించి రిమాండ్ కు పంపామని... ఇప్పుడు అంబటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అనేది రాజకీయ పార్టీనా? లేక రౌడీల పార్టీనా? అని ప్రశ్నించారు.