పద్మ పురస్కారాల విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు
- పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
- వివిధ రంగాల్లో వారు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమన్న వైఎస్ జగన్
- వారి సేవలు నిరంతరం కొనసాగించాలని ఆశిస్తున్నానన్న వైఎస్ జగన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే కేంద్రం పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా జగన్ పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి.