లొకేషన్స్ కోసమైనా చూడవలసిన మిస్టరీ థ్రిల్లర్ ఇది!
- మలయాళంలో హిట్ కొట్టిన సినిమా
- 5 కోట్లతో 50 కోట్లు కొల్లగొట్టిన కంటెంట్
- ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు
- ఆద్యంతం కట్టిపడేసే లొకేషన్స్
- జనవరి 7నుంచి తెలుగులోను అందుబాటులోకి
నిజానికి ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో కూడా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వచ్చాయి. అయితే మిగతా భాషలలో జనవరి 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని అధికారికంగా తెలియజేశారు. మలయాళ భాష తెలియకపోయినా ఈ సినిమా చూడొచ్చు. కథాకథనాలతో పాటు అద్భుతమైన లొకేషన్స్ కనువిందు చేస్తాయి. లొకేషన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చుననే ఒక ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది.
కథ విషయానికి వస్తే .. అటు ఫారెస్ట్ .. ఇటు కొండ ప్రాంతం కలిసిన చిన్న విలేజ్ ను ఆనుకుని ఉన్న ఒక ఎస్టేట్ అది. ఆ ఎస్టేట్ కి అధిపతి కురియాచన్. ఎస్టేట్ లో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అతను చాలా కుక్కలు పెంచుతుంటాడు. అలాంటి కురియాచన్ హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కోసం మోహన్ వస్తాడు. కురియాచన్ ఏమైపోయాడు? అతనిని వెతుక్కుంటూ వచ్చిన మోహన్ ఎవరు? అనేది మిగతా కథ.